S R Manohar
इस सप्ताह के लिए पिता के ह्रदय से
अब हमें क्या करना चाहिए ?
एस. आर. मनोहर
ఈ వారము ధ్యానం కొరకు – తండ్రి హృదయములో నుండి
మనము ఇప్పుడు ఏమి చేయవలెను?
మన అందరికి అనేకరకమైన అవసరాలు ఉన్నాయి మరియు అందులో కొన్ని చాలా ముఖ్యమైనవి. వాటి గురించి మీరు సమస్తము (అనగా ప్రార్ధన, ఉపవాసము , దేవుని వాక్యమును ఒప్పుకొనుట, ఆత్మీయ పోరాటం మొదలగునవి) చేసిఉండవచ్చు. మరియు ఇంకా మీరు జవాబును చూడలేదు మరియు ఏ విధమైన దిగ్విజయమునకు సూచన కనిపించలేదు. మనము ఇప్పుడు ఏమి చెయాలి అని మీరు ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు?
“సమస్తము నెరవేర్చినవారై నిలువబడుడి” అని బైబిలు చెప్పుచున్నది. (ఎఫిసి 6:13, 14).
విశ్వాసములో నిలువబడుడి – దేవుని మంచితనము మరియు కనికరములో నిలువబడుడి.
విఫలముకాని దేవుని వాగ్దానముల మీద నిలువబడుడి.
దేవుని సంతోషములో నిలువబడి ఉండుడి.
కృతజ్ఞత మరియు స్తుతితో నిలువబడుడి.
కానీ, మరి ముఖ్యముగా, సంపూర్ణ పరిశుద్ధతలో నిలువబడుడి.నీ ప్రార్ధనకు సమాధానమును మరియు దిగ్విజయమును దేవుడే నీ మేలు కొరకు నిలిపిఉండవచ్చు. భూసంబంధమైన నీ అవసరాలకు నీకు సమాధానము యిప్పుడు పొందుకొనివుండవచ్చు, కానీ పరిశుద్ధత లోపించినందున నీ జీవితము కొరకు దేవుని ఉద్దేశ్యములను చేజారిపోయే అవకాశముంది. నిత్యజీవమును కూడా కోల్పోయే అవకాశముంది. “వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.” అని కీర్తనలు 106:15 లో చెప్పబడెను. ఆలస్యము నీ స్వంత ప్రయోజనము కొరకే.
దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించాడు కావున నీవు నిశించిపోవుట ఇష్టము లేదు. నీ సౌఖ్యముకొరకు నీ వ్యక్తిత్వమును ఆయన త్యాగము చేయడు.
దేవుని వాక్యమును ప్రతిరోజూ చదివి, నిన్ను నీవు ఎక్కడ సరిదిద్దుకోవలెనో చూపించమని దేవుని అడుగు. బహుశా దేవుడు నిన్ను కొన్ని విషయాలను విడిచిపెట్టమని లేదా కొన్ని పనులు చేయమని చెప్పవచ్చు. వాగ్దానదేశములోనికి ఇశ్రాయేలీయులను నడిపించినది కేవలము విశ్వాసము కాదు గాని వారి విశ్వాసము మరియు విధేయత.
“నేను ఐగుప్తు దేశములోనుండి మీ పితరులను రప్పించిన దినమున దహనబలులనుగూర్చిగాని బలులనుగూర్చిగాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటినిగూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికిచ్చి తిని. ఏదనగా ‘నా మాటలు మీరు అంగీకరించినయెడల నేను మీకు దేవుడనై యుందును మీరు నాకు జనులై యుందురు; మీకు క్షేమము కలుగునట్లు నేను మీకాజ్ఞా పించుచున్న మార్గమంతటియందు మీరు నడుచుకొనుడి’.” అని దేవుడు చెప్పెను.(యిర్మియా 7:22, 23)
దేవుని వాక్యముపై ప్రేమతో కూడిన విధేయత ద్వారా నిజమైన ఆశీర్వాదములు దొరుకును. నీవు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు ఆయనకు విధేయుడవైనావు.
కావున చివరిగా, యేసును ప్రేమిస్తూ నిలువబడుము.
ఎస్ ఆర్ మనోహర్
Courses
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Sermons
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
Word
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
CD
The purpose of this training is according to Ephesians 4:13 that we all reach unity in the faith
The first thing I want you to know is that our God is a ‘Blesser God’. Everything about God is: He is a Great Giver, He gives Himself.
The Lord has led us to release 2 to 5 minutes short sermon clips every few days entitled A Timely Word